బాలీవుడ్ నటి దిశా పటానీ నటించిన తాజా చిత్రం 'మలంగ్'. ఇందులో పాత్ర కోసం హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీని ఆదర్శంగా తీసుకున్నట్టు తెలిపిందీ అమ్మడు. ఈ చిత్రంలో వ్యతిరేక ఛాయలున్న పాత్రలో నటించటం ఓ కొత్త అనుభూతిని ఇచ్చిందని వెల్లడించింది దిశా.
"మలంగ్' కథ విన్న కొద్ది నిమిషాల్లోనే ఈ సినిమాకు ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇలాంటి పాత్రలు అమ్మాయిలు అరుదుగా పోషిస్తారు. వ్యతిరేక ఛాయలున్న పాత్రలు చేయాలంటే చాలా ఇష్టం. హలీవుడ్లో నెగటివ్ రోల్స్ చేస్తున్న ఏంజెలీనా జోలీనే ఆదర్శంగా తీసుకున్నాను. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆమె నటించిన కొన్ని సన్నివేశాలను చూసి స్ఫూర్తి పొందాను. ఈ చిత్రంలో హీరోతో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు."
- దిశా పటానీ, బాలీవుడ్ నటి