తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెండు రూపాయల కోసం ఇబ్బందిపడిన అమితాబ్​ - కౌన్​బనేగా కరోడ్​ పతి

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్ బచ్చన్​ ఒకానొక సమయంలో రెండు రూపాయలు లేక చాలా ఇబ్బంది పడ్డారట. ఇటీవలే ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్​ బనేగా కరోడ్​పతి' షోలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

Amitabh
బచ్చన్

By

Published : Oct 3, 2020, 10:52 AM IST

భారత సినీరంగంలో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన నటుడు అమితాబ్​ బచ్చన్​. ఈ బాలీవుడ్​ మెగాస్టార్.. ప్రస్తుతం​ కోట్లాది రూపాయలు పారితోషకం తీసుకుంటూ అగ్రనటుల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు. కానీ, ఇదే బిగ్​బీ​ ఒకప్పుడు రెండు రూపాయలు లేక ఇబ్బంది పడ్డారట. ఇటీవలే జరిగిన 'కౌన్ ​బనేగా కరోడ్​పతి' కార్యక్రమంలో పాల్గొన్న ఓ పోటీదారు.. "చిన్నప్పుడు నాకిష్టమైన తినుబండారం కొనుక్కోడానికి రూ.7 అవసరమైతే, మా అమ్మ రూ.5 ఇచ్చింది" అని చెప్పారు. అప్పుడు అమితాబ్ సైతం తన చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తు చేసుకున్నారు.

అమితాబ్ బచ్చన్​

"నా చిన్నప్పుడు స్కూల్​ క్రికెట్​ టీమ్​లో చేరాలనుకున్నా. దానికి రెండు రూపాయలు అవసరమయ్యాయి. అమ్మని అడిగితే లేవని చెప్పింది. అందుకే ఇప్పటికీ రెండు రూపాయల విలువ ఏంటో నాకు తెలుసు."

అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ నటుడు

అదే సమయంలో తనకు తన తండ్రి ఇచ్చిన బహుమతి గురించి కూడా గుర్తు చేసుకున్నారు బిగ్​బీ. "నాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నాన్న తొలిసారి రష్యాకు వెళ్లినప్పుడు కెమెరా తీసుకొచ్చారు. అది ఇప్పటికీ నా వద్దే ఉంది." అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details