బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan Pan Masala) ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రచారం చేస్తున్న పాన్ మసాలా వాణిజ్య ప్రకటన నుంచి తప్పుకొన్నారు. ఆ యాడ్‌లో నటించినందుకు ఆయన తీసుకున్న డబ్బును కూడా సదరు సంస్థకు తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాన్ని 'ది ఆఫీస్ ఆఫ్ మిస్టర్ అమితాబ్ బచ్చన్' బ్లాగ్‌లో పోస్ట్ చేసింది.
"వాణిజ్య ప్రకటన (pan masala amitabh) ప్రసారమైన కొన్ని రోజుల తర్వాత గత వారం సదరు సంస్థను కలిశారు అమితాబ్. ఆ తర్వాత ప్రచారం నుంచి తప్పుకొన్నారు. బిగ్‌బీకి.. అది బ్యాన్ అయిన ప్రొడక్ట్ అని తెలియక ప్రమోషన్ చేశారు. అది తెలుసుకున్నాక సదరు సంస్థతో సంప్రదింపులు జరిపి ప్రమోషన్ కోసం తాను తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేశారు. "
-బిగ్ బీ ఆఫీస్.
గత నెల నేషనల్ యాంటీ టొబాకో అనే స్వచ్ఛంద సంస్థ(National Anti-Tobacco Program).. పాన్ మసాలాను ప్రచారం చేస్తున్న వాణిజ్య ప్రకటన నుంచి తప్పుకోవాలని అమితాబ్‌ను కోరింది(Amitabh Bachchan Pan Masala). ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో బిగ్‌బీ ప్రమోషన్ నుంచి తప్పుకొన్నారు.