తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అన్నదాతలకు అండగా.. బిగ్​బీ దాతృత్వం - అమితాబ్​ బచ్చన్​

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​​ మరోసారి ఉదారగుణాన్ని చాటుకున్నారు. బిహార్​కు చెందిన దాదాపు 2 వేల 100 మంది రైతుల రుణాలు చెల్లించారు. బ్లాగ్​లో స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు అమితాబ్​.

2వేల మంది రైతుల రుణాలు చెల్లించిన బిగ్​బీ

By

Published : Jun 12, 2019, 6:06 PM IST

Updated : Jun 13, 2019, 10:22 AM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమాలతో కాదు.. సేవాగుణంతో. బిహార్​కు చెందిన దాదాపు 2 వేల మందికి పైగా రైతుల రుణాలను స్వయంగా చెల్లించారు అమితాబ్​ బచ్చన్​.

ఈ వివరాలను స్వయంగా బ్లాగ్​లో వెల్లడించారు 76 ఏళ్ల నటుడు.

కుమార్తె శ్వేత, కుమారుడు అభిషేక్​ చేతుల మీదుగా కొంత మంది రైతులను ఇంటికి పిలిపించి నగదు మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు అమితాబ్​ బచ్చన్​.

''ఒక వాగ్దానం పూర్తయింది. బిహార్​లో రుణాలు చెల్లించాల్సిన సుమారు 2,100 మందిని ఎంపిక చేశాం. బ్యాంక్​ ఓటీఎస్​ ద్వారా నగదు మొత్తాన్ని చెల్లించాం. కొంతమందిని జనక్​కు పిలిపించి వ్యక్తిగతంగా అభిషేక్​, శ్వేత చేతుల మీదుగా నగదు ఇప్పించా.''

- బ్లాగ్​లో అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ నటుడు

ముంబయిలోని అమితాబ్​ బచ్చన్​ నివాసం పేరు జనక్​.

పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల కోసం మరో వాగ్దానం చేశానని.. అది కూడా పూర్తి చేస్తానని పేర్కొన్నారు.

''ఇప్పుడు మరో వాగ్దానం నెరవేర్చడానికి జనక్​కు వెళ్తున్నా. పుల్వామా దాడిలో అమరుల కుటుంబాలకు కొంత మొత్తాన్ని సాయంగా అందిస్తా.''

- అమితాబ్​ బచ్చన్​.

అమితాబ్​ బచ్చన్​ ఇలా రుణాలు చెల్లించడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 1398 మంది రైతులు.. మహారాష్ట్రలో 350 మంది రైతులు రుణమొత్తాన్ని చెల్లించారు.

ఇదీ చూడండి:

చంద్రయాన్​-2 ప్రయోగం ఆ రోజే: ఇస్రో

Last Updated : Jun 13, 2019, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details