నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం 'జెర్సీ'. మంచి ఫీల్ గుడ్ సినిమాగా టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఈ మూవీని తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తమిళ ‘జెర్సీ’లో విశాల్, అమలాపాల్..? - jersy
టాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీ 'జెర్సీ'ని తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా విష్ణు విశాల్, అమలా పాల్ నటిస్తున్నట్లు సమాచారం.
సినిమా
ఈ రీమేక్‌లో కథానాయకుడు విష్ణు విశాల్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. అమాలాపాల్ హీరోయిన్గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఇంతకుముందు 'రాట్ససన్' అనే చిత్రంలో నటించారు. టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. మరి ఈ విషయం ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి.. ట్రైలర్: 'డ్రీమ్ గర్ల్'గా ఆయుష్మాన్
Last Updated : Sep 26, 2019, 11:21 PM IST