సాధారణంగా ట్రైలర్, టీజర్ బాగుంటే ఇతర సినిమాల్లో అవకాశలొస్తాయి. కానీ ఓ టీజర్‌ని చూసి మరో సినిమా నుంచి తొలగించిన ఘటన హీరోయిన్ అమలాపాల్‌కు ఎదురైంది. విజయ్‌తో అమలాపాల్ ఓ చిత్రం చేయాల్సి ఉండగా.. ‘ఆమె’ ప్రచార చిత్రం చూసి అందులో నుంచి తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిందీ కథానాయిక. ఈ విషయమై స్పందిస్తూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.
అందుకే 'ఆమె'ను తొలగించారా..! - అమలాపాల్
'ఆమె' సినిమా టీజర్ చూసి తనను విజయ్ సేతుపతి చిత్రం నుంచి తొలగించారని చెప్పింది హీరోయిన్ అమలాపాల్. సినీ పరిశ్రమలో ఇలాంటి ధోరణి మారాలని అభిప్రాయపడింది.
అందుకే 'ఆమె'ను తొలగించారా..!
"‘ఆమె’ టీజర్ విడుదలైన తర్వాత నన్ను విజయ్ సేతుపతి సినిమా నుంచి తొలగిస్తున్నామని నిర్మాత రత్న కుమార్ చెప్పారు. ఈ టీజర్‌తో వారి చిత్రంపై నెగిటివ్ టాక్ వస్తుందన్న ఉద్దేశంతో తీసేసుంటారు. ఇలాంటి ఆలోచనా ధోరణి మారితేనే పరిశ్రమ బాగుంటుంది. విజయ్‌కి వ్యతిరేకంగా ఇది చెప్పడంలేదు, అతడితో నటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా." -అమలాపాల్, నటి
ఇది చదవండి: 'బందోబస్త్'గా వస్తున్న హీరో సూర్య