కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న 'ఓ మై కాదవులే' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. యువనటుడు విశ్వక్‌సేన్ కథానాయకుడిగా ఈ రీమేక్ రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమాలో అల్లు అర్జున్ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఒరిజినల్‌లో విజయ్‌సేతుపతి పోషించిన పాత్రను రీమేక్‌లో బన్నీ చేయనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే బన్నీని సంప్రదించిందని.. ఆయన కూడా ప్రాజెక్ట్ పట్ల సుముఖత వ్యక్తం చేశారని టాలివుడ్ వర్గాల్లో వినికిడి. దీంతో విశ్వక్‌సేన్ - అల్లు అర్జున్ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
క్లాసిక్ ప్రేమకథలో అల్లు అర్జున్, విశ్వక్‌సేన్! - ఓ మై కాదవులే హీరోస్
'ఓ మై కాదవులే' రీమేక్ చిత్రంలో అల్లు అర్జున్ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరో నటుడు విశ్వక్‌సేన్ కథానాయకుడిగా ఈ రీమేక్ రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది.
రితికాసింగ్, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం 'ఓ మై కాదవులే'. చిన్నప్పటి నుంచి స్నేహితులైన ఓ జంట ప్రేమ వివాహంతో ఒక్కటవుతారు. అయితే పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లెక్కుతారు. మరి, ఆ జంట విడిపోయారా? లేదా కలిశారా? వంటి ఆసక్తికర అంశాలతో 'ఓ మై కాదవులే' తెరకెక్కింది. ఈ మొత్తం కథను వేరే వాళ్లకు వివరించే పాత్రలో విజయ్‌సేతుపతి కనిపిస్తారు.
ఇదీ చదవండి:ఓటీటీ స్టార్‌గా సూర్య.. ప్రైమ్‌లో 'జై భీమ్'