గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా యువహీరో అల్లు శిరీష్ మొక్కలు నాటారు. నటుడు విశ్వక్సేన్.. తనకు ఈ సవాలు విసిరినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది మంచి కార్యక్రమం అని, రోజురోజుకూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. తన మేనల్లుడు అర్నవ్, మరదలు అన్వితతో పాటు సమరా, నివ్రితిలకు మొక్కలు నాటాలని చాలెంజ్ విసిరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అల్లు శిరీష్ - Green India Challenge tollywood
'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' మంచి కార్యక్రమం అని చెప్పిన అల్లు శిరీష్.. తన వంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటారు. ఆ వీడియోను ట్వీట్ చేశారు.
అల్లు శిరీష్