విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎఫ్-3'(F3 Movie Update). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్(F3 Movie Shooting) హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బుధవారం ఈ సినిమా సెట్‌లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun News Today) సడెన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాకతో సెట్ మొత్తం ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. వెంకీ, వరుణ్‌లతో బన్నీ సరదాగా ముచ్చటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఎఫ్-3' టీమ్ కొన్ని ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసింది.
F3 Movie Shooting: 'ఎఫ్-3' షూటింగ్లో బన్నీ సందడి - వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2
'ఎఫ్-3' సినిమా షూటింగ్(F3 Movie Shooting) సెట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోన్న ఈ చిత్రీకరణలో(F3 Movie Update) సడెన్ ఎంట్రీ ఇచ్చిన బన్నీ(Allu Arjun News Today).. అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది.
F3 Movie Shooting: 'ఎఫ్-3' షూటింగ్లో బన్నీ సందడి
బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న 'ఎఫ్-2' సినిమాకు సీక్వెల్‌గా(F2 Movie Sequel) ఈ సినిమా సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. వెంకీ, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహరీన్ సందడి చేయనున్నారు. సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి..చైతూ-సమంత విడాకులు.. వెంకటేశ్ పోస్ట్ వైరల్