తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అర్హ 'అంజలి అంజలి' పాట .. అతిథి పాత్రలో బన్నీ - allu arjun latest news

అల్లు అర్హ పుట్టినరోజున ప్రత్యేక ఆల్బమ్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ముద్దు ముద్దు హావభావాలు ఇచ్చిన ఈ చిన్నారి ఆకట్టుకుంటోంది.

allu arjun special appearance in allu arha anjali anjali song
అర్హ 'అంజలి అంజలి' పాట .. అతిథి పాత్రలో బన్నీ

By

Published : Nov 21, 2020, 1:42 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ.. ఆయన అభిమానులందరికీ ఇప్పటికే పరిచయం. తన ముద్దు మాటలు, ఫొటోలతో చాలా క్రేజ్ సంపాదించుకుంది. శనివారం(నవంబరు 21) ఆ చిన్నారి నాలుగో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 'అంజలి అంజలి' గీతాన్ని అర్హతో రీ క్రియేట్​ చేశారు.

అల్లు అర్హ నాలుగో పుట్టినరోజు

ఇందులో అర్హతో పాటు అల్లు అయాన్, అల్లు అరవింద్ కనిపించారు. చివర్లో బన్నీ కూడా వచ్చి, అభిమానుల్ని సర్​ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details