తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఊ అంటావా..' పాటకు కొరియోగ్రఫీ చేయనని చెప్పా: గణేశ్ ఆచార్య - samantha pushpa song

Oo antava song: యూట్యూబ్​లో ప్రస్తుతం సెన్షేసన్​ సృష్టించిన 'ఊ అంటావా..' పాటకు తొలుత తాను కొరియోగ్రఫీ చేయనని చెప్పినట్లు గణేశ్ ఆచార్య చెప్పారు. ఆ తర్వాత అంగీకారం తెలపడానికి గల కారణాన్ని వెల్లడించారు.

Oo Antava song
ఊ అంటావా సాంగ్

By

Published : Feb 2, 2022, 10:46 PM IST

Samantha pushpa song: సెన్సేషనల్‌ సాంగ్‌ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా'కు మొదట తాను కొరియోగ్రఫీ చేయనని చెప్పానని ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య చెప్పారు. సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో ఈ పాటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన పలు విషయాలను గణేశ్‌ వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు.

గణేశ్ ఆచార్య- సమంత

"పుష్ప' సినిమా డిసెంబర్‌ 17న విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలోని 'ఊ అంటావా' పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే, ఈసినిమా విడుదల కావడానికి ముందు డిసెంబర్‌ 2న అల్లు అర్జున్‌ నాకు ఫోన్‌ చేశారు. 'మాస్టర్‌.. మా సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌కు మీరు కొరియోగ్రఫీ చేయాలి' అని అడిగారు. అప్పటికే నేను కంటి శుక్లాలకు సర్జరీ చేయించుకోవడానికి వైద్యుడి వద్ద అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా. దాంతో.. 'ఏం అనుకోవద్దు బన్నీ.. నేను చేయలేను. ఎందుకంటే నాకు రేపే సర్జరీ ఉంది' అని చెప్పడం వల్ల ఆ చిత్ర నిర్మాతలు మా డాక్టర్‌తో మాట్లాడి నా సర్జరీ డేట్‌ను మరో రోజుకి మార్చేలా చేశారు. అలా, నేను ఈ పాటకు కొరియోగ్రఫీ చేయగలిగాను. మొదటి రెండు రోజులపాటు రిహార్సల్స్‌ చేశాం. దీనికి ఇంత క్రేజ్‌ వచ్చిందంటే నా కొరియోగ్రఫీ ఒక్కటే కాదు.. సమంత-బన్నీ హార్డ్‌ వర్క్‌ కూడా ఉంది. ఈ పాటలో వాళ్లిద్దరి నటనకు అందరూ కనెక్ట్‌ అయ్యారు" అని గణేశ్‌ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details