బాలీవుడ్‌లో తెరకెక్కిన మూడు చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ తెలిపారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన బన్నీ తనకు బాలీవుడ్ పరిశ్రమపై అభిమానముందని చెప్పారు. అనంతరం తనకు నచ్చిన బాలీవుడ్ చిత్రాల గురించి తెలియజేశారు.
"బాలీవుడ్‌లో తెరకెక్కిన అన్ని చిత్రాల్లో ఓ మూడింటిని ఎక్కువ సార్లు వీక్షించా. అలా నాకిష్టమైన చిత్రాల్లో 'జో జీతా వహీ సికందర్' ఒకటి. 20 కంటే ఎక్కువ సార్లే దానిని చూశా. అలాగే షారుఖ్ నటించిన 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' చిత్రాన్ని కూడా ఎక్కువసార్లు వీక్షించా. ఇప్పటికీ ఆ సినిమాని చూస్తే వ్యక్తిగతంగా ఓ మధురానుభూతిని పొందుతా. ఇటీవల కాలంలో విడుదలైన 'గల్లీబాయ్'ని 3-4 సార్లు చూశా. వ్యక్తిగతంగా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది."