తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప'లో ఆ ఒక్క షాట్​ కోసం 12 గంటలు కష్టపడ్డ బన్నీ

Allu arjun pushpa: 'పుష్ప' సినిమాలో కూలీగా కనిపించేందుకు అల్లుఅర్జున్ ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలానే సినిమాలో ఓ షాట్​ కోసం దాదాపు 12 గంటలు పట్టింది. ఇంతకీ ఆ షాట్ ఏంటంటే?

allu arjun pushpa
అల్లు అర్జున్ పుష్ప

By

Published : Jan 10, 2022, 5:36 PM IST

Pushpa movie: 'పుష్ప'.. మొన్న మొన్నటి వరకు థియేటర్లలో దుమ్మురేపింది. ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీలో కేవలం రూ.80 కోట్ల కలెక్షన్లు సాధించింది.

'పుష్ప' బిహైండ్​ ద సీన్స్ పేరిట చిత్రబృందం ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' సాంగ్​లోని ఓ షాట్​ కోసం అల్లు అర్జున్ 12 గంటలకుపైగా కష్టపడ్డారని తెలిపింది. ఇందులో 24 రకాల డ్రస్​లు వేసుకున్న బన్నీ.. అందుకు తగ్గ వేరియేషన్స్​ కూడా ఇచ్చాడని పేర్కొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ప్రయత్నిస్తే ఈ షాట్ ఫర్ఫెక్ట్​గా వచ్చిందని చెప్పింది. అందుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

'పుష్ప' రెండో భాగం షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుందని డైరెక్టర్ సుకుమార్ చెప్పారు. ఈ ఏడాది డిసెంబరులోనే థియేటర్లలో సినిమా రిలీజ్ చేయనున్నారు. అలానే 'పుష్ప' హిందీ ఓటీటీకి సంబంధించిన రిలీజ్ డేట్​ను ప్రకటించారు.

పుష్ప హిందీ ఓటీటీ

ABOUT THE AUTHOR

...view details