తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'యాత్ర' దర్శకుడితో అల్లు అర్జున్ చిత్రం! - అల్లు అర్జున్ కొత్త సినిమా్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​ 'పుష్ప' తర్వాత 'ఐకాన్' అనే చిత్రం చేయబోతున్నాడు. అయితే దాని తర్వాత ఇతడు 'యాత్ర' దర్శకుడు మహీ వీ రాఘవ్​తో ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

'యాత' దర్శకుడితో అల్లు అర్జున్ చిత్రం!
'యాత' దర్శకుడితో అల్లు అర్జున్ చిత్రం!

By

Published : Jul 17, 2020, 6:57 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నాడు. తర్వాత 'ఐకాన్' అనే మూవీ చేయాల్సి ఉంది. దాని తర్వాత మురగదాస్​, సురేందర్ రెడ్డి, కొరటాల శివలతో సినిమాలు చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. తాజాగా బన్నీతో సినిమా చేసే డైరెక్టర్ల లిస్టులో మరో పేరు వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా 'యాత్ర' అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నాడు మహీ వీ రాఘవ్. అయితే ఈ డైరెక్టర్ తర్వాత చిత్రం బన్నీతో ఉంటుందని తెలుస్తోంది. ఇది పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతుందట. అధికారిక ప్రకటన రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం మహీ.. 'యాత్ర'కు సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

బన్నీ కూడా 'ఐకాన్' పూర్తయ్యాక వేరే సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉంది. ప్రస్తుతం 'పుష్ప' కోసం విభిన్న లుక్​ను ట్రై చేస్తున్నాడీ హీరో. అతడి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్​లుక్​కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details