అల్లు అర్జున్‌కు ఈ ఏడాది సంక్రాంతి బాగా కలిసొచ్చింది. 'అల వైకుంఠపురములో' సినిమాతో వచ్చి బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎన్నో రికార్డులు కైవసం చేసుకుంది. ముఖ్యంగా సినిమా విజయంలో తమన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. యూట్యూబ్‌లో ఈ మూవీ సాంగ్స్ వందల మిలియన్ల వీక్షణలను దక్కించుకొని సత్తా చాటాయి. ప్రధానంగా 'బుట్టబొమ్మ' పాట విశేష ప్రేక్షకాదరణ పొందింది.
'బుట్టబొమ్మ' సాంగ్ మరో ఆల్‌టైం రికార్డు - alluarjun latest news updates
'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' సాంగ్ ఇప్పటికే అనేక రికార్డులు నెలకొల్పింది. తాజాాగా యూట్యూబ్‌లో 30 కోట్ల వీక్షణలను సాధించి చరిత్ర సృష్టించింది.
అల్లు అర్జున్
తాజాగా ఈ సాంగ్ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకు ఏకంగా 3 కోట్ల వీక్షణలను సాధించి రికార్డు నెలకొల్పింది. దీంతో అత్యంత వేగంగా ఇన్ని వ్యూస్ పొందిన తొలి తెలుగు పాటగా చరిత్ర సృష్టించింది. అర్మాన్ మాలిక్ ఈ సాంగ్‌ను ఆలపించాడు.