తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరో సరికొత్త కథలో అల్లరి నరేశ్

కామెడీ హీరో అల్లరి నరేశ్​.. కొత్త సినిమాను ప్రకటించాడు. విజయ్ కనకమేడల అనే నూతన దర్శకుడితో చేసేందుకు అంగీకరించాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.

అల్లరి నరేశ్​

By

Published : Nov 12, 2019, 2:06 PM IST

గత కొన్నేళ్లుగా పరాజయాలతో సతమతవుతోన్న హీరో అల్లరి నరేశ్. ఇటీవలే మహేశ్​బాబు 'మహర్షి'లో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 'బంగారు బుల్లోడు' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు కథానాయకుడిగా మరో చిత్రం ఖరారు చేశాడు.

అల్లరి నరేశ్​ కొత్త సినిమా బృందం

కొత్త దర్శకుడు విజయ్​ కనకమేడలకు అవకాశమిచ్చాడు నరేశ్. ఎస్వీటూ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై సతీశ్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఇది చదవండి: నాకు తొమ్మిదిసార్లు పెళ్లి చేశారు: అల్లరి నరేశ్

ABOUT THE AUTHOR

...view details