అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకుడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను నేడు సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. నరేశ్ మరోసారి విభిన్న పాత్రలో మెప్పిస్తున్నారు. ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచింది.
ట్రైలర్: నా జీవితం అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది - అల్లరి నరేశ్ నాంది ట్రైలర్
అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కిన 'నాంది' సినిమా ట్రైలర్ విడుదలైంది. మరోసారి విభిన్న పాత్రలో అలరిస్తున్నారు నరేశ్.
సీరియస్ కథతో ఇంటెన్సివ్ ఎమోషన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. రాజగోపాల్‌ను ఎవరు హత్య చేశారు? నరేశ్‌కు ఆ హత్యకు సంబంధం ఏంటి? ఓ అమాయకుడైన వ్యక్తిని హంతకుడిగా ముద్ర వేస్తే జరిగే పరిణామాలేంటి? అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. ఇటీవలే 'బంగారు బుల్లోడు' అనే చిత్రంతో థియేటర్లకు వచ్చిన నరేశ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇతడికి 'నాంది' కమ్ బ్యాక్ మూవీ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.