తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ పాట షూటింగ్ సమయంలో మా బైక్ లోయలోకి దూసుకెళ్లింది!' - గులాబి ఫేం నటి మహేశ్వరి

Alitho saradaga Actress Maheswari: 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు సినీనటి మహేశ్వరి. ఓ పాట షూటింగ్​ సమయంలో బైక్​ రైడ్​ చేస్తుండగా తమ వాహనం అదుపుతప్పి ఓ చిన్న లోయలోకి పడిపోయిందని, అదృష్టం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. తన కెరీర్​లో 'గులాబి' చిత్రం అంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదని పేర్కొన్నారు.

Alitho saradaga actress Maheswari
ఆలీతో సరదాగా నటి మహేశ్వరి

By

Published : Jan 18, 2022, 4:43 PM IST

Alitho saradaga Actress Maheswari: ఓ పాట చిత్రీకరణలో భాగంగా బైక్​ రైడ్​ చేస్తున్నప్పుడు.. తన వాహనం​ స్లిప్​ అయి ఓ చిన్న లోయలోకి వెళ్లిపోయిందని.. అదృష్టం కొద్ది ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు గతాన్ని గుర్తుచేసుకున్నారు 'గులాబి' ఫేం సినీ నటి మహేశ్వరి. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆమె తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు.

ఇందులో భాగంగా అలనాటి తార శ్రీదేవితో తనకున్న బంధం గురించి వివరించారు. శ్రీదేవి తనుకు పిన్ని అవుతారని, కానీ అక్క అని పిలిచేదాన్నని తెలిపారు. ఆమె లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మబుద్ధికావడంలేదన్నారు.

"స్వతహాగా నేను చాలా కామ్​గా ఉంటాను. దాన్ని కొందరు మరోలా అర్థం చేసుకున్నారు. శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా అందుకే పొగరు అని నా ముందే అనేవారు" అని గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు.

నటిగా.. దర్శకుడు భారతీరాజా అవకాశం ఇచ్చారని తెలిపారు. తాను నటించిన 'గులాబి' చిత్రం అంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదని పేర్కొన్నారు మహేశ్వరి. సినిమా సెట్స్‌లో.. నటుడు నవీన్‌ ఎలా ఉండేవారో చెప్పారు.

పదహారేళ్లకే మహేశ్వరి నటిగా మారారు. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన 'కరుతమ్మ' చిత్రంతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె 'అమ్మాయి కాపురం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'గులాబి', 'దెయ్యం', 'పెళ్లి', 'జాబిలమ్మ పెళ్లి', 'మా బాలాజీ', 'మా అన్నయ్య', 'నీకోసం' తదితర చిత్రాలతో విశేషంగా అలరించారు.

ఇదీ చూడండి:పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్​ బోల్డ్​ బ్యూటీకి ఊరట

ABOUT THE AUTHOR

...view details