తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆలియా-రణ్​బీర్​.. బలపడుతోన్న బంధం..! - ranbeer mother

బాలీవుడ్  ప్రేమజంట రణ్​బీర్ కపూర్-ఆలియా భట్​ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ రెస్టారెంట్లో రణ్​బీర్​ తల్లి నీతూ కపూర్​తో ఆలియా కలిసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

ఆలియా

By

Published : Nov 15, 2019, 6:31 AM IST

ఈ మధ్య కాలంలో ఏ మాత్రం సమయం దొరికినా చాలు నటి ఆలియా భట్‌.. రణ్‌బీర్‌ కపూర్‌ కుటుంబంతో గడిపేస్తోంది. కొన్నాళ్లు డేటింగ్‌లో ఉన్న ఆలియా - రణ్‌బీర్‌లు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కానీ ఆలియా మాత్రం పెళ్లికి ముందే కాబోయే అత్త నీతూ సింగ్‌తో కలిసి విందుల్లో పాల్గొంటూ ముందుకు సాగిపోతుంది.

ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ - నీతూ కపూర్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌ విందులో పాల్గొన్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. ఆ చిత్రంలో ఆలియా కాబోయే అత్త నీతూకు, ప్రేమికుడు రణ్‌బీర్‌కు మధ్య చిరునవ్వుతో సంతోషంగా ఉంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు శుభకార్యాలప్పుడు రాకపోకలు సాగిస్తున్నాయి. అంతే కాదు ఆ మధ్య రిషి కపూర్‌ కేన్సర్‌ వ్యాధి చికిత్స నిమిత్తం కొన్నాళ్ల పాటు న్యూయార్క్​లో ఉన్నారు. ఆ సమయంలోనూ ఆలియా అక్కడికి వెళ్లి మరీ పలకరించింది.

నీతూ కపూర్​తో ఆలియా

మొత్తం మీద పెళ్లికి ముందే ఆలియా అత్తమామలను ఇంత బాగా చూసుకుంటే, పెళ్లి తరువాత ఇంకెంత బాగా చూసుకుంటుందో అని సినీ జనాలు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమజంట అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న 'బ్రహ్మాస్త్ర'లో కలిసి నటిస్తున్నారు. ఆలియా తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన కనిపించనుంది.

ఇవీ చూడండి.. నూతన దర్శకుడితో నేచురల్ స్టార్..!

ABOUT THE AUTHOR

...view details