బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో అడుగుపెట్టింది. డిసెంబరు మొదటి వారంలో తన తొలి షెడ్యూల్లో పాల్గొని.. వారం క్రితం ముంబయికి వెళ్లింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఓ అద్భుతమైన అనుభూతి అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
రాజమౌళి దర్శకత్వంలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని అలియా తెలిపింది. అయితే ప్రతి సన్నివేశానికి తెలుగు, హిందీ భాషల్లో డైలాగ్లు పలకడానికి కొంచెం కష్టపడినట్లు వెల్లడించింది.