తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"జక్కన్నతో పనిచేయడం అదృష్టం"

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్​ షూటింగ్​లో పాల్గొనేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఆలియా భట్ తెలిపింది.

By

Published : Mar 14, 2019, 6:54 PM IST

అలియా భట్

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా భట్ కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. దీనిపై ఆలియా ట్విట్టర్లో స్పందించింది.

'ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పనిచేయడం నా అదృష్టం.. రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్​తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా. దక్షిణాదిన నా మొట్టమొదటి సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

ఆర్ఆర్ఆర్​లో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుంది ఆలియా. మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 1920 నాటి కాలంలో జరిగిన కథతో సినిమా తెరకెక్కుతోంది.

ABOUT THE AUTHOR

...view details