Ala Vaikunthapurramuloo Hindi Dubbed: 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ థియేటర్ రిలీజ్ ఇప్పటికే వాయిదా పడింది. అయితే ఈ చిత్ర హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్‌మైన్స్ సంస్థ తాజాగా మరో ప్రకటన చేసింది. ఫిబ్రవరి 6న ఈ చిత్రాన్ని తమ సొంత ఛానలైన 'ఢించక్ టీవీ'లో ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.
'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జోడీగా రీమేక్ చేశారు. దీనికి 'షెహజాదా' అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు సమస్య రాకూడదనే డబ్బింగ్ మూవీ థియేటర్ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు నేరుగా టీవీలో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.