తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నీరజ్‌ చోప్రా నా బయోపిక్‌లో హీరోగా నటించాలి' - నీరజ్​ చోప్రా బయోపిక్​

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్​ చోప్రాపై బాలీవుడ్ హీరో అక్షయ్​ కుమార్ ప్రశంసలు కురిపించాడు. నీరజ్ గొప్ప అందగాడని పొగిడాడు. తన బయోపిక్​(akshay kumar biopic) తీయాల్సి వస్తే నీరజ్ నటిస్తే బాగుంటుందని అన్నాడు.

akshay kumar biopic
అక్షయ్​ కుమార్ బయోపిక్​

By

Published : Aug 11, 2021, 10:58 AM IST

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. విజయగాధలను తెరమీద చూపించడానికి దర్శకనిర్మాతలు.. చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌(tokyo olympic) జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించి అందరి దృష్టి తనవైపు తిప్పుకొన్న నీరజ్‌చోప్రా.. ఒక్కసారిగా సోషల్‌ మీడియా హీరో అయిపోయాడు. కేవలం క్రీడలకే పరిమితం చేయాలేదు అభిమానులు. 23ఏళ్ల కుర్రాడైన నీరజ్‌ బయోపిక్‌ గురించి చర్చలు మొదలయ్యాయి.

గతంలో ఓ జాతీయ మీడియాలో అక్షయ్‌ కుమార్‌ తన బయోపిక్‌(neeraj chopra biopic) కనుక తీస్తే హీరోగా నటిస్తే బాగుంటుందని నీరజ్ అభిప్రాయం వ్యక్తం చేయగా.. అక్షయ్‌ కూడా తన మనసులో మాటను వ్యక్తం చేశాడు. "నీరజ్‌ అందగాడు. చూడగానే ఇట్టే ఆకట్టుకుంటాడు. ఏదో ఒక రోజు నా జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కే సందర్భం వస్తే.. నా పాత్ర నీరజ్‌ పోషించాలి" అంటూ మీడియా సమావేశంలో ఈ 'బెల్‌బాటమ్‌' హీరో బయటపెట్టాడు.

ABOUT THE AUTHOR

...view details