ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, ధనుష్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'అత్రాంగిరే'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగ్రాలో తాజ్ మహల్ వద్ద జరుగుతోంది. తాజాగా.. షూటింగ్‌లోని ఓ సరదా వీడియోను అక్షయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అందులో తాజ్ మహల్ ముందు షాజహాన్ వేషధారణలో గిరిగరా తిరుగుతూ కనిపించాడు అక్షయ్. ఈ స్లో మోషన్ వీడియోను షేర్ చేస్తూ 'వాహ్ తాజ్' అని రాసుకొచ్చాడు.
తాజ్‌మహల్ ముందు 'షాజహాన్'గా అక్షయ్ - sara ali khan and akshay new movie
'అత్రాంగిరే' షూటింగ్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. ఓ సరదా వీడియోను తన అభిమానుతో పంచుకున్నాడు. ఆ వీడియోలో.. తాజ్ మహల్ ముందు షాజహాన్ వేషధారణలో గింగిరాలు తిరుగుతూ కనిపించాడు అక్షయ్.
తాజ్ మహల్ ముందు 'షాజహాన్'గా అక్షయ్
ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కుతున్న 'అత్రాంగిరే'లో సారా అలీ ఖాన్.. బిహారి అమ్మాయి పాత్రలో కనువిందు చేయనుంది. ఆగ్రాలో షెడ్యూల్ పూర్తి కాగానే.. మధురై, ముంబయి, దిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. జాతీయ అవార్డు గ్రహీత హిమాన్షు శర్మ కథ అందిస్తుండగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2021 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.