తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫోర్బ్స్​: సంపాదనలో హాలీవుడ్​ హీరోలతో అక్షయ్ పోటీ - బ్రాడ్లీ కూపర్

ప్రపంచంలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటుల జాబితాలో అక్షయ్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్​ ఈ జాబితాను గురువారం ప్రకటించింది. ఇందులో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు అక్షయ్‌.

అక్షయ్ కుమార్

By

Published : Aug 22, 2019, 6:12 PM IST

Updated : Sep 27, 2019, 9:47 PM IST

వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బాలీవుడ్​ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్​ మరో రికార్డు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా 2018-19 సీజన్​కుగానూ అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుల జాబితాను ప్రఖ్యాత ఫోర్బ్స్​ గురువారం ప్రకటించింది. ఇందులో నాలుగో స్థానం(ఏడాది రూ.466 కోట్లు) సంపాదించాడు అక్కీ.

హాలీవుడ్​ నటులు డ్వేన్ జాన్సన్(రూ.640 కోట్లు), 'అవెంజర్స్​' ఫేమ్​ క్రిస్ హేమ్​వర్త్(రూ.547 కోట్లు), 'ఐరన్​మ్యాన్​' ఫేమ్ రాబర్ట్​ డౌనీ జూనియర్(రూ.473 కోట్లు) ఇతడి కంటే ముందున్నారు.

డ్వేన్ జాన్సన్- క్రిస్ హేమ్​వర్త్- రాబర్ట్ డౌనీ జూనియర్

అక్షయ్ తర్వాత స్థానాల్లో జాకీచాన్(రూ.415 కోట్లు), బ్రాడ్లీ కూపర్(రూ.408 కోట్లు), ఆడమ్ సాండ్లర్(రూ.408 కోట్లు), క్రిస్ ఎవాన్స్(రూ.311 కోట్లు), పాల్ రాడ్(రూ.293 కోట్లు), విల్ స్మిత్(రూ.250 కోట్లు) ఉన్నారు.

ఇటీవలే 'మిషన్​ మంగళ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్.. రూ.100 కోట్ల మార్క్​ను అందుకున్నాడు. అదే విధంగా ఒక్కో సినిమాకు 5-10 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకునే ఈ కిలాడీ హీరో.. 20పైగా వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తూ భారీగానే ఆర్జిస్తున్నాడు.

ఇది చదవండి: నెట్​ఫ్లిక్స్​ చిత్రం చేసేందుకు ప్రియాంక చోప్రా సిద్ధం

Last Updated : Sep 27, 2019, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details