తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2020, 8:07 AM IST

Updated : Feb 18, 2020, 5:01 AM IST

ETV Bharat / sitara

తెలుగులో నాగ్​ అందిస్తున్న '83'

భారత జట్టు మొదటిసారి ప్రపంచకప్​ గెలిచి క్రీడాలోకాన్నే నివ్వెరపరిచింది. ఇప్పుడు ఆ స్మృతులను '83' పేరుతో వెండి తెరపైకి తీసుకురానున్నారు. తెలుగులో నాగార్జున చేతుల మీదుగా విడుదల చేయనుంది చిత్ర బృందం.

Akkineni Nagarjuna's Annapurna Studios is going to present the Telugu version of '83'
వెండితెరపై క్రికెట్​ ప్రపంచకప్​ స్మృతులు

1983లో తొలిసారి భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ గెలుచుకుని సత్తా చాటింది. ఆ ప్రయాణం అనన్య సామాన్యం. ఇప్పుడు ఆ గతస్మృతుల్ని '83' రూపంలో వెండి తెరపైకి తీసుకొస్తున్నారు. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్‌ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, తాహిర్‌ రాజ్‌ బాసిన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి అన్నపూర్ణ స్డూడియోస్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది.

"1983 ప్రపంచకప్‌ విజయంతో దేశంలో క్రికెట్‌ స్వరూపమే మారిపోయింది. క్రికెట్‌ అనేది ఓ మతంలా ఉద్భవించింది. ఈ ప్రయాణాన్ని నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం. మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు గర్వంగా ఉంది."
- నాగార్జున, కథానాయకుడు

నాగార్జున అంటే అందరికీ గౌరవమని, ఆయన చేతుల మీదుగా తెలుగులో ఈ చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉందని దర్శకుడు కబీర్​ఖాన్​ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

ఇదీ చదవండి: ఒక్క చిత్రానికి రూ.120 కోట్ల పారితోషికమా..!

Last Updated : Feb 18, 2020, 5:01 AM IST

ABOUT THE AUTHOR

...view details