తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'కు గాయం! - అక్కినేని అఖిల్​ చిత్ర షూటింగ్​లో గాయం

అక్కినేని అఖిల్​ ప్రస్తుతం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' చిత్రంలో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో అతడు గాయపడినట్లు సమాచారం. ఫలితంగా ఐదు రోజుల పాటు షూటింగ్​కు దూరంగా ఉండాలని అఖిల్​కు వైద్యులు సూచించారట.

akhil
టాలీవుడ్​ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'కు గాయం

By

Published : Mar 5, 2020, 5:25 PM IST

అక్కినేని యువ హీరో అఖిల్‌ తన తాజా చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' చిత్రీకరణలో గాయపడినట్లు సమాచారం. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అఖిల్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ కామెడీ ఫైట్‌ చిత్రీకరణ జరుపుతుండగా.. అఖిల్‌ కుడి భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది.

ఇది తీవ్రమైన గాయం కానప్పటికీ కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారట. ఫలితంగా అఖిల్‌ మార్చి 10 వరకు మళ్ళీ సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. అతడు అందుబాటులో లేకున్నా చిత్రీకరణ కొనసాగనుందని టాక్​.

ఓ వైవిధ్యమైన ప్రేమకథతో 'బొమ్మరిల్లు' భాస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం.

టాలీవుడ్​ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'కు గాయం

ఇదీ చూడండి : ఆ డైరెక్టర్​కు అప్పుడే చెక్​ ఇచ్చేసిన అల్లు అరవింద్

ABOUT THE AUTHOR

...view details