తమిళంలో అగ్ర హీరోగా రాణిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నాడు అజిత్. ప్రస్తుతం 'వాలిమై' సినిమాలో పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. అయితే తన తదుపరి (61వ) చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు ఎవరనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. వీటిన్నింటిపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
అజిత్ కొత్త చిత్రానికి దర్శకుడు ఎవరు?
తమిళ హీరో అజిత్.. ప్రస్తుతం 'వాలిమై' సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత నటించబోయే చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
అజిత్
ఈ మధ్య కాలంలో అజిత్.. దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో కలిసి పనిచేయనున్నాడనే వార్తలొచ్చాయి. రవికుమార్ వాటిని ఖండించాడు.
ప్రస్తుతం నటిస్తున్న 'వాలిమై'కి బోనీ కపూర్ నిర్మాత. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే నెల్లోనే షూటింగ్ పూర్తి చేసి, దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది చిత్రబృందం.
Last Updated : Mar 2, 2020, 3:41 PM IST