బాలీవుడ్ అందాల భామ కాజోల్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వినూత్నంగా తెలిపాడు భర్త అజయ్ దేవగణ్. కుర్చీలో కూర్చొని నిద్ర పోతున్న ఆమె ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసి... దానికి ఓ సందేశాన్ని చేర్చాడు.
" నిద్ర లే..! అందం కోసం ఇంకా నిద్రపోవాల్సిన అవసరం లేదు".
-- అజయ్ దేవగణ్, సినీ నటుడు
అజయ్ ట్వీట్‌కు స్పందించిన కాజోల్ " నేను మేల్కొనే ఉన్నాను. అబ్బాయి(యుగ్)కి స్కూల్ లేదని తెలిసింది. చుట్టుపక్కల అందరికీ సెలవులే" అని బదులిచ్చింది.