బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్.. ఓటీటీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. 'రుద్ర: ద ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' టైటిల్‌తో తెరకెక్కుతున్న సిరీస్‌లో అజయ్ పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. దీని ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు.
ఓటీటీ ఎంట్రీకి అజయ్ దేవ్‌గణ్ రెడీ - Ajay Devgn latest news
'ఆర్ఆర్ఆర్'లో నటిస్తూ బిజీగా ఉన్న అజయ్ దేవ్‌గణ్.. ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నారు. 'రుద్ర' అనే పోలీస్ డ్రామా సిరీస్‌లో నటిస్తున్నారు.
అజయ్ దేవ్‌గణ్
ఈ సిరీస్ షూటింగ్ మొత్తాన్ని ముంబయిలోనే జరపనున్నారు. బ్రిటీష్ సిరీస్ 'లూథర్'కు రీమేక్ 'రుద్ర'. ఇడ్రిస్ ఎల్బా పోషించిన పాత్రనే ఇక్కడ అజయ్ పోషిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం.