అజయ్ దేవగణ్ మల్టీస్టారర్ చిత్రాల్లోనే కాదు.. అన్ని రకాల ప్రాంతీయ భాషల్లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం అతను ప్రధాన పాత్రలో కనిపించనున్న చిత్రం 'మైదాన్'. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ముందుగా నవంబర్ 27న రిలీజ్ చేయాలకున్నా.. తాజాగా తేదీని మార్పు చేస్తున్నట్టు నిర్మాణసంస్థ వెల్లడించింది. డిసెంబరు 11న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
'మైదాన్' సినిమా విడుదల తేదీలో మార్పు - ఆర్ఆర్ఆర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్న చిత్రం 'మైదాన్'. ఈ చిత్రాన్ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పుట్బాల్ కోచ్గా కనిపించనున్నాడీ స్టార్హీరో.
'మైదాన్' సినిమా విడుదల తేదీలో మార్పు
ఫుట్‌బాల్ కోచ్ పాత్రలో..
హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితాధారంగా తెరకెక్కుతున్న 'మైదాన్' చిత్రానికి.. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియో, బోనీకపూర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అజయ్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇదీ చూడండి..సామ్ చిత్రమా.. రవివర్మకే అందని అందమా!
Last Updated : Feb 29, 2020, 3:35 AM IST