బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యా రాయ్‌తో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇటీవలే వీరికి కరోనా పాజిటివ్ రాగా ఇన్నిరోజులు ఇంటివద్దే ఐసోలేషన్‌లో ఉన్నారు. కానీ సడెన్‌గా హాస్పిటల్లో చేరే సరికి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదని వారు బాగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్
బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్, తన కుమార్తె ఆరాధ్య ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇటీవలే వీరిద్దరికీ కరోనా పాజిటివ్ రాగా ఇన్నిరోజులు ఇంటివద్ద ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్
ఇటీవలే అమితాబ్ బచ్చన్‌తో పాటు తనయుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరు నానావతి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఐశ్వర్య కూడా ఇదే హాస్పిటల్లో చేరారు.
Last Updated : Jul 17, 2020, 11:22 PM IST