బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లకు పెళ్లయి నేటికి 12 సంవత్సరాలు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. కుటుంబంతో సరదాగా గడిపేందుకు మలేసియాలో కొన్ని రోజుల పాటు ఉంటారట.
మాల్దీవుల్లో ప్రపంచసుందరి పెళ్లిరోజు వేడుక - gulab jamoon
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్... భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తోంది. ఇందుకు కారణం నేటితో అభి-ఐష్ జంటకు పెళ్లయి పుష్కరకాలం పూర్తయింది. సంతోషంగా గడపడానికి అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.
మాల్దీవుల్లో ప్రపంచసుందరి పెళ్లిరోజు వేడుక
త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో అనురాగ్ కశ్యప్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. సర్వేష్ మేవారా దర్శకుడు. దీనికి ‘గులాబ్ జామూన్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ 'ఫన్నే ఖాన్' చిత్రంలో నటించింది. ఇందులో పాప్ స్టార్‌గా సందడి చేసింది. రాజ్‌కుమార్ రావ్, అనిల్ కపూర్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కింది.