గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాల వల్ల తెలుగు సినీ పరిశ్రమతో పాటు తారల స్టార్డమ్ కూడా పెరుగుతోంది. హిందీలోనూ వారికి పలువురు దర్శకనిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో ప్రభాస్, విజయ్ దేవరకొండ, రష్మిక లాంటి నటీనటులు ముంబయిలో ఫ్లాట్స్ కొని అక్కడా సెటిలవుతున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్స్ కూడా అక్కడ సొంత ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న రామ్‌చరణ్.. సతీమణి ఉపాసనతో కలిసి స్నేహితులకు గతవారం పార్టీ ఇచ్చారట. ముంబయిలో ఫ్లాట్ కొన్నందుకేనని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చేస్తున్న చిత్రం, ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు కూడా పాన్ ఇండియావే కావడం వల్ల చరణ్.. ముంబయిలోనూ ఓ ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందని భావించారట.