వైవిధ్య చిత్రాలతో ఆకట్టుకునే హీరో అడివి శేష్. ప్రస్తుతం అతడు ఓ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముంబయి కాల్పుల్లో వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కతోంది. 'మేజర్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రధాన పాత్ర పోషిస్తున్న శేష్... ఇందుకోసం జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
పాత్రలో సహజత్వం ఉండేందుకు ఆర్మీ క్యాంపులు సందర్శించి అక్కడి అధికారులతో సంభాషణలు జరుపుతున్నాడట. ఇప్పటి వరకు థ్రిల్లర్ కథలను ప్రేక్షకులకు సరికొత్తగా చూపి విజయం అందుకున్న శేష్ బయోపిక్‌తో ఎలా అలరిస్తాడో చూడాలి.