తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాయిపల్లవితో పాటు అదితీ రావు కూడా?

నాని కొత్త సినిమాలో సాయిపల్లవితో పాటు అదితీ రావు హైదరీ కూడా హీరోయిన్​గా నటించనుందని సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.

సాయిపల్లవితో పాటు అదితీ రావు కూడా?
సాయిపల్లవి-అదితీ రావు హైదరీ

By

Published : Aug 22, 2020, 9:42 PM IST

'వి' సినిమాతో విడుదలకు సిద్ధమైన హీరో నాని.. 'టక్ జగదీష్', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. 'టక్ జగదీష్' ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుని, కరోనా కారణంగా ఆగిపోయింది. మరోవైపు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న 'శ్యామ్ సింగరాయ్' గురించిన ఆసక్తికర వార్త ప్రస్తుతం సినీ సర్కిల్స్​లో హాట్​టాపిక్​గా మారింది.

నాని 'శ్యామ్​సింగరాయ్' సినిమా

అదేంటంటే?

ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లని నటించనుందని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లకు చోటుందని, రెండో భామగా అదితీ రావు హైదరీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలో ఉన్నా త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారట. నాని-అదితీ ఇదివరకే 'వి'లో కలిసి నటించారు.

ABOUT THE AUTHOR

...view details