తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2021, 5:39 PM IST

ETV Bharat / sitara

'మేజర్'​ టీజర్​ రిలీజ్​ డేట్​-'టక్​ జగదీశ్​' సాంగ్​

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మేజర్​' సినిమా టీజర్​ను ఏప్రిల్​ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ​నాని 'టక్​ జగదీశ్'​ సినిమాలోని ఓ పాట మేకింగ్​ వీడియో విడుదలైంది.

major
మేజర్​

26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. ఈ సినిమాలో అడివి శేష్.. సందీప్ పాత్రలో కనిపించనున్నారు. శనివారం ఈ సినిమాకు సంబంధించి 'లెటర్ టు సందీప్​' పేరుతో ఓ పోస్టర్​ విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్ర టీజర్​ను ఏప్రిల్​ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను సూపర్​స్టార్ మహేశ్​బాబు నిర్మిస్తుండగా.. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జులై 2న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

మేజర్​

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్​టైనర్ 'టక్ జగదీష్'. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. శనివారం ఈ చిత్రంలోని 'ఇంకోసారి ఇంకోసారి' అంటూ సాగే పాట మేకింగ్​ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

గల్లీ రౌడీ

ABOUT THE AUTHOR

...view details