తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రష్మిక కొత్త లుక్​-జాన్​ అబ్రహం సినిమాలో ఆ హీరో - 101 zillala andagadu movie avasarala srinivas

కొత్త సినిమాల అప్డేట్స్​ వచ్చేశాయి. హీరోయిన్​ రష్మిక, జాన్​ అబ్రహం, అవసరాల శ్రీనివాస్​ సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.

rashmika
రష్మిక

By

Published : Apr 5, 2021, 3:30 PM IST

శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'ఆడాళ్లు మీకు జోహార్లు'. సోమవారం రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆమె లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆడాళ్లు మీకు జోహార్లు

బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహం ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నారు. జేఏ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై'విక్కీ డోనర్‌', 'మద్రాస్‌ కేఫ్‌' వంటి చిత్రాలను నిర్మించిన జాన్‌.. 'తార వర్సెస్‌ బిలాల్‌' అనే చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందులో హర్షవర్ధన్‌ రాణే, అంగిర ధార్‌ నాయకానాయికలుగా నటించనున్నారు. ఈ చిత్రానికి సమర్‌ షేక్ దర్శకత్వం వహించనున్నారు.

హర్షవర్ధన్​

అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం '101 జిల్లాల అందగాడు'. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రుహానీ శర్మ కథానాయిక. టైటిల్‌ గీతాన్ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని అందగాళ్లని మించిన అందగాడు సూర్య నారాయణ అంటూ సరదాగా సాగుతుందీ పాట. మే 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అప్సర

ఇదీ చూడండి: ఎయిర్​పోర్ట్​లో జాన్వీ.. అదిరే ఔట్​ఫిట్​తో పూజ

ABOUT THE AUTHOR

...view details