తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వరుడు కావలెను.. కానీ షరతులు వర్తిస్తాయి'

తనకు పెళ్లి కొడుకు కావాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది హీరోయిన్​ అదాశర్మ. కానీ కొన్ని షరతులు ఉన్నాయని చెబుతూ ఇన్​స్టాలో ఓ పెద్ద వ్యాఖ్యను జోడించింది.

హీరోయిన్​ అదాశర్మ

By

Published : Sep 22, 2019, 6:06 PM IST

Updated : Oct 1, 2019, 2:45 PM IST

'హార్ట్​ ఎటాక్', 'కల్కి' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన హీరోయిన్ అదాశర్మ.. నెటిజన్లకు ఓపెన్​ ఆఫర్ ఇచ్చింది. పెళ్లి కొడుకు కావాలని చెబుతూ ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. వీటితో పాటే ఓ పెద్ద వ్యాఖ్యను జోడించి, పెళ్లి కూతురు ముస్తాబుతో ఉన్న ఫొటోలను పంచుకుంది.

పెళ్లి దుస్తుల్లో హీరోయిన్​ అదా శర్మ

"పెళ్లి కుమారుడు కావలెను. అతడు ఉల్లిపాయలు తినకూడదు. రంగు, కులం, ఫాలోవర్స్, రాశి.. లాంటి విషయాలతో పనిలేదు. కచ్చితంగా మూడు పూటలు నవ్వుతూ వంట వండాలి. క్రమం తప్పకుండా షేవింగ్ చేసుకోవాలి. సంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలి. మద్యం, మాంసాహారం ఇంటా బయట నిషేధం. భారత్​లోని అన్ని భాషా చిత్రాలపై గౌరవం ఉండాలి. వాటిని చూసి ఆస్వాదించే వాడై ఉండాలి." -ఇన్​స్టాలో అదాశర్మ

అయితే ఈ పోస్ట్​ చూసి ఆశ్చర్యానికి గురైన నెటిజన్లు.. ఆమె ఈ నిర్ణయం సరదాగా తీసుకుందా లేదా తికమకలో ఉండి మాట్లాడిందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్​లో 'బైపాస్​ రోడ్', 'కమాండో 3' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ.

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details