తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఔను.. నేను ప్లాస్టిక్​ సర్జరీ చేయించుకున్నా' - శ్రుతి హాసన్​

actress srhuthi hasan strong reply on her comments at instagram
'ఔను..! నేను ప్లాస్టిక్​ సర్జరీ చేయించుకున్నా'

By

Published : Feb 28, 2020, 3:56 PM IST

Updated : Mar 2, 2020, 8:59 PM IST

ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రుతిహాసన్‌. కొంతకాలం విరామం తీసుకొని, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ భామ.. ఈ మధ్యే ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో సన్నగా, బక్క పల్చగా ఉన్న శ్రుతిపై కొందరు విమర్శలు చేశారు. వారికి ఘాటుగా సమాధానం ఇస్తూ మరో పోస్ట్‌ పెట్టిందీ ముద్దుగుమ్మ. గతంలో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నానని, ఎవరో చెప్పినట్లు తాను జీవించనని రాసుకొచ్చింది.

"ఈ పోస్ట్‌ చేయడం వెనుక ఓ కారణముంది. ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేదు. 'ఆమె ఒకప్పుడు లావుగా ఉండేది. ఇప్పుడు చాలా సన్నగా ఉంది' అంటూ వరుస కామెంట్లు చేయడం సరికాదు. ఈ రెండు ఫొటోలు మూడు రోజుల కిందట తీసినవి. ఇప్పుడు చెప్పబోయే విషయం ప్రతి మహిళా ఎదుర్కొనేదే. హార్మోన్ల సమస్య కారణంగా తరచూ శారీరకంగా, మానసికంగా నేను ఇబ్బంది పడుతున్నా. గత కొన్నేళ్లుగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో కష్టపడుతున్నా. అదేమంత సులభం కాదు. శారీరకమార్పుల వెనుక కష్టం మామూలుగా ఉండదు. కానీ, నా ప్రయాణం గురించి చెప్పడం చాలా సులువు. ఒకరి స్థాయిని మరొకరు నిర్ణయించలేరు. ఇది నా జీవితం నా ముఖం. ఈ విషయాన్ని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. గతంలో ప్లాస్టిక్‌సర్జరీ చేయించుకున్నా. ఈ విషయం గురించి ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నానా? లేదు. అలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఎలా జీవించాలో అలాగే జీవిస్తా. మనకు మనం చేసుకునే మంచి ఏదైనా ఉందంటే, మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ప్రేమను పంచండి. నిత్యం నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకుంటున్నా. మీరూ అలాగే చేయండి"

శ్రుతిహాసన్​, సినీ నటి

శ్రుతి హాసన్​

శ్రుతిహాసన్‌ ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన 'క్రాక్‌'లో నటిస్తోంది. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. దీంతో పాటు తమిళంలో 'దేవి', 'లాభం' చిత్రాల్లో నటిస్తోంది.

Last Updated : Mar 2, 2020, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details