తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బోధిధర్మని పిలవమంటున్నారు: శ్రుతి - కమల్​హాసన్​

హీరోయిన్​ శ్రుతిహాసన్​కు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. ఆమె నటించిన సెవెన్త్​ సెన్స్​ సినిమా చూశారుగా.. అందులోనూ చైనా వల్ల ప్రస్తుత కరోనా వైరస్​ తరహా వైరస్​ ముప్పు ఏర్పడుతుంది. సినిమాలో బోధిధర్మ వచ్చి విముక్తి కలిగించినట్లే.. ఇప్పుడూ అతడిని పిలవమని శ్రుతిని అడుగుతున్నారట అభిమానులు.

బోధిధర్మని పిలవమంటున్నారు: శ్రుతి
బోధిధర్మని పిలవమంటున్నారు: శ్రుతి

By

Published : Mar 30, 2020, 7:04 AM IST

కరోనా వైరస్‌ వల్ల శ్రుతిహాసన్‌కి కొత్త చిక్కొచ్చింది. ఆమెని తన సినిమాలోలాగా ఒక సాహసం చేయమని వేడుకుంటున్నారట అభిమానులు. ఇంతకీ ఆ సాహసమేంటో తెలుసా? ఆమె కథానాయికగా నటించిన 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమాలో కరోనా వైరస్‌ తరహాలోనే చైనా వల్ల ఒక వైరస్‌ ముప్పు ఏర్పడుతుంది. ఆ వైరస్‌ నుంచి మనకు విముక్తి కలగాలంటే బోధిధర్మ రావడమే మార్గం అనే విషయం జన్యు పరిశోధకురాలైన శ్రుతిహాసన్‌ తెలుసుకుంటుంది.

వందేళ్ల కిందటి బోధిధర్మని కథలోకి తీసుకొస్తుంది. దాంతో సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పుడు కరోనాతో సమస్యల్లో ఉన్నాం కాబట్టి... ఆ సినిమాలోలాగా బోధిధర్మని పిలవండంటూ శ్రుతిని పదే పదే అడుగుతున్నారట అభిమానులు. ఆ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details