తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి దోపిడీ

నటి మీరా చోప్రా తండ్రిని, నడిరోడ్డుపై కత్తితో బెదిరించి ఫోన్​ ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ విషయాన్ని మీరా చోప్రా ట్విట్టర్​ వేదికగా పంచుకుంది.

By

Published : May 6, 2020, 4:07 PM IST

Updated : May 6, 2020, 7:41 PM IST

Actress Priyanka Chopra's uncle robbed at knifepoint in Delhi
ప్రియాంక చోప్రా అంకుల్​ను కత్తితో బెదరించి.. ఆపై

'బంగారం', 'వాన', 'గ్రీకువీరుడు' వంటి తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది హీరోయిన్ మీరా చోప్రా. ప్రముఖ హీరోయిన్​ ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరి అయిన ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేస్తోంది. నిన్న(మంగళవారం) సాయంత్రం తన తండ్రిని బెదిరించిన ఇద్దరు దుండగులు.. ఆయన ఫోన్ ఎ్తతుకెళ్లారని ట్వీట్ చేసింది. ఎంతో సురక్షితమని చెప్పుకుంటున్న దిల్లీలో ఇలాంటి ఘటన జరగడమేంటని రాసుకొచ్చింది.

"నా తండ్రి బయటికి వెళ్లినప్పుడు, ఇద్దరు దుండగులు స్కూటర్​పై వచ్చి కత్తితో బెదిరించి ఫోన్​ దోచుకెళ్లారు. దిల్లీలోని పోలీస్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు దిల్లీని సురక్షిత ప్రాంతమని ఎలా అనుకోవాలి?"

-మీరా చోప్రా, నటి

ఈ విషయంపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారికి ధన్యవాదాలు చెబుతూ మీరా చోప్రా మరో ట్వీట్ చేసింది.

Last Updated : May 6, 2020, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details