అగ్ర కథానాయకుడు బాలకృష్ణకు జోడీగా మలయాళీ భామ ఆడిపాడనుందా? - అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.
బాలయ్య కొత్త చిత్రంలో మలయాళీ భామకు ఛాన్స్! - బాలకృష్ణ సినిమాలో ప్రయాగ మార్టిన్
నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య సరసన మలయాళీ భామ ప్రయాగ మార్టిన్ ఎంపికైనట్లు సమాచారం.
బాలయ్య కొత్తచిత్రంలో మలయాళీ భామకు ఛాన్స్!
'సింహా', 'లెజెండ్' తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా మలయాళీ భామ ప్రయాగ మార్టిన్ ఎంపికైనట్టు సమాచారం. త్వరలోనే మొదలు కానున్న షెడ్యూల్‌లో ఈమె రంగంలోకి దిగనున్నట్టు తెలిసింది. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై అభిమాలను అలరిస్తుంది.