మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్(maa elections prakash raj panel) గెలవాలని తాను కోరుకుంటున్నట్టు నటి పూనమ్ కౌర్ తెలిపారు(Poonam kaur movies). అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ఓ ట్వీట్ పెట్టారు. " 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్(Maa elections 2021) సర్ గెలవాలని కోరుకుంటున్నా. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు' అని పేర్కొన్నారు.
ఆయన గెలిస్తే నా సమస్యలు బయటపెడతా: పూనమ్ - మా ఎలక్షన్స్ ప్రకాశ్‌రాజ్ ప్యానల్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో(Maa elections 2021) ప్రకాశ్‌రాజ్ గెలవాలని ఆశించారు నటి పూనమ్ కౌర్. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉందని చెప్పారు.
పూనమ్ కౌర్
ప్రకాశ్‌రాజ్ 'మా' ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. 'శౌర్యం', 'గణేష్', 'గగనం', 'శ్రీనివాస కల్యాణం' సహా పలు చిత్రాల్లో పూనమ్ కౌర్ నటించి మెప్పించారు. ప్రకాశ్‌రాజ్-పూనమ్ కలిసి 'గగనం' చిత్రంలో నటించారు.
ఇదీ చూడండి: 'నాతో ఆ దర్శకుడు దారుణంగా మాట్లాడాడు'
Last Updated : Oct 2, 2021, 10:00 AM IST