తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ బాలీవుడ్​ నటుడితో ప్రేమలో ఉన్నా: కృతి కర్బందా - swetha rohira

బాలీవుడ్​ నటుడు పుల్కిత్ సామ్రాట్​తో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది నటి కృతి కర్బందా. గతంలో వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నట్టు వచ్చిన వార్తలు నిజమేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ జోడీ 'పాగల్​ పంతీ' చిత్రంలో కలిసి నటిస్తోంది.

ఆ బాలీవుడ్​ నటుడు ప్రేమలో పడేశాడు: కృతి కర్బందా

By

Published : Nov 20, 2019, 6:30 AM IST

'తీన్​మార్', 'ఒంగోలు గిత్త' సినిమాల్లో నటించిన కృతి కర్బందా... ప్రేమలో మునిగితేలుతందట. బాలీవుడ్​ నటుడు పుల్కిత్ సామ్రాట్​తో డేటింగ్​లో ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఒప్పుకొంది. పుల్కిత్​తో ప్రేమ వ్యవహారం గురించి కృతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

"అవును మొదట నేను పుల్కిత్​తో సన్నిహితంగానే ఉన్నా. అతను నా అభిప్రాయాలను గౌరవించాడు. మన మనసుకు దగ్గరైన వ్యక్తి, ఇష్టాలు తెలుసుకుని నడుచుకునే అబ్బాయిని ఏ అమ్మాయి అయినా వదులుకుంటుందా? అందుకే నేను అతని ప్రేమలో పడిపోయా.. ముందు ఇంట్లో వాళ్లు పుల్కిత్​ గురించి ఒప్పుకుంటారా లేదా అని బెంగపడ్డాను. ఒక్కోసారి మనసులోని ప్రేమను తెలియజేయడానికి సంవత్సరాలు పట్టొచ్చు... కొన్ని నెలలు పట్టవచ్చు. కానీ నా విషయంలో అది నెలల కాలంలోనే నెరవేరింది. నేను చాలా అదృష్టవంతురాలిని".

--కృతి కర్బందా, నటి

పుల్కిత్​ సామ్రాట్​కు శ్వేతా రోహిరాతో 2015లో వివాహం జరిగింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో హీరోయిన్ యామీ గౌతమితో ఈ హీరో డేటింగ్​లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం కృతి - పుల్కిత్​ కలిసి అనీష్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాగల్‌ పంతీ’లో నటిస్తున్నారు. ఇందులో అనీల్‌ కపూర్, జాన్‌ అబ్రహాం, ఇలియానా తదితరలు నటిస్తున్నారు. నవంబర్‌ 22న(శుక్రవారం) సినిమా విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details