తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దుగుమ్మ ఇలియానా కొత్త బాయ్​ఫ్రెండ్! - మూవీ న్యూస్

తన బాయ్​ఫ్రెండ్​ ఎవరు? అని ఓ నెటిజన్​ అడగ్గా, ఆసక్తికర సమాధానమిచ్చింది ముద్దుగుమ్మ ఇలియానా. ప్రస్తుతం ఈమె హిందీలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

actress ileana new boyfriend
నటి ఇలియానా

By

Published : Mar 3, 2021, 7:39 AM IST

గోవా బ్యూటీ ఇలియానా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సందడి చేసింది. ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరిట నిర్వహించిన ఈ చాటింగ్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకొందీ ముద్దుగుమ్మ.

ఈ సందర్భంగా 'మీ బాయ్‌ ఫ్రెండ్‌ పేరేంటి?' అని ఇలియానాను ఓ నెటిజన్ అ‌డగ్గా తాను పెంచుకుంటున్న కుక్కను చూపించి వీడి పేరు ఛార్లీ అంటూ బదులిచ్చింది. గతంలో ఆండ్రూ అనే వ్యక్తితో ఇలియానా ప్రేమాయణం సాగించింది. ప్రస్తుతం వీళ్లద్దరూ విడిగానే ఉంటున్నారు.

'దేవదాసు' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. 'అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ', 'ది బిగ్‌ బుల్‌' చిత్రాలతో బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది.

ఇన్​స్టాలో స్టోరీస్​లో ఇలియానా పోస్ట్

ABOUT THE AUTHOR

...view details