రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాలోని కీలక పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈనెలలోనే కథానాయిక ఆలియా ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఇప్పుడామె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయ్ కథియావాడి' చిత్రం చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ.. ఆలస్యం చేస్తోన్న ఆలియా! - రామ్‌చరణ్ వార్తలు
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని కీలక ఘట్టాల్ని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇందులో కథానాయకగా నటిస్తున్న ఆలియాభట్.. చిత్రీకరణలో పాల్గొనడానికి మరింత ఆలస్యమయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబయిలో చిత్రీకరణ జరుపుకొంటున్న కథియావాడి ఈనెల తొలి వారంలోనే ముగియాల్సి ఉంది. కానీ, ఇప్పుడీ షెడ్యూల్‌ను మరో రెండు వారాలు పొడిగించారట భన్సాలీ. ఈ నేపథ్యంలోనే ఆలియా 'ఆర్‌ఆర్‌ఆర్'లో అడుగుపెట్టడం మరింత ఆలస్యమవుతోందని సమాచారం. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విప్లవ వీరులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఫిక్షనల్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనుండగా.. అల్లూరిగా రామ్‌చరణ్ దర్శనమివ్వనున్నారు.