తన మొండిపట్టుదల వల్లే చాలా చిత్రాల్లో అవకాశాలు కోల్పోయానని బాలీవుడ్ నటి మల్లికాషెరావత్ తెలిపింది. తన స్థానంలో కొంత మంది హీరోలు వారి గర్ల్ఫెండ్స్కు చాన్స్ ఇచ్చారని చెప్పింది. ప్రస్తుతం వాళ్లను చూస్తుంటే తెలివితక్కువవారిలా కనిపిస్తుంటారని అభిప్రాపయపడింది.
"నా మొండితనం వల్ల చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయా. నేను ఎక్కువ మాట్లాడుతున్నానంటూ హీరోలు తమ చిత్రాలు తప్పించారని విన్నాను. నా స్థానంలో వారి అత్యంత సన్నిహితులకు అవకాశం కల్పించారు. ఇలా 20, 30 చిత్రాల్లో అవకాశం కోల్పోయుంటా. ఇందుకు నేనేమి బాధపడట్లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే వాల్లందరూ తెలివిలేని మూర్ఖుల్లా కనిపిస్తుంటారు" - మల్లికాషెరావత్, బాలీవుడ్ నటి
సామాజిక ఇబ్బందులు, మహిళల సమస్యల గురించి తాను మాట్లాడితుంటే వినడానికి ఎవరూ సిద్ధపడట్లేదని తెలిపింది.