తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అఖండ'లో విలన్​గా చేయగలనా అని భయపడ్డా: శ్రీకాంత్ - balayya akhanda

అభిమానులతో పాటు 'అఖండ' సినిమా కోసం తాను కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు శ్రీకాంత్ చెప్పారు. ఇందులో క్రూరమైన విలన్​గా నటించానని అన్నారు.

srikanth akhanda movie
బాలకృష్ణ శ్రీకాంత్ అఖండ

By

Published : Nov 25, 2021, 5:33 PM IST

'అఖండ' చిత్రంలో ప్రతినాయకుడిగా తనను, తన వేషధారణను నందమూరి బాలకృష్ణే ఎంపిక చేశారని శ్రీకాంత్ స్పష్టం చేశారు. వరదరాజులు పేరుతో చాలా క్రూరమైన ప్రతినాయకుడిగా నటించినట్లు వెల్లడించారు.

'అఖండ' విలన్​ శ్రీకాంత్

ఇలాంటి పాత్ర రావడం చాలా అరుదు అని శ్రీకాంత్ చెప్పారు. ఫ్యామిలీ ఇమేజీ ఉన్న తాను.. ఇలాంటి క్యారెక్టర్​కు న్యాయం చేయగలనా అని తొలుత భయపడ్డానని అన్నారు.

బాలకృష్ణతో కలిసి రెండో సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్న శ్రీకాంత్.. 'అఖండ' చిత్రాన్ని అభిమానులతో కలిసి చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 2న అఖండ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో బాలయ్య రెండు విభిన్న గెటప్స్​లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోరా కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఆ లుక్స్, పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్​తో నిర్మించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details