ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ షూటింగ్లో గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళనపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాశ్‌రాజ్.. తన ఎముక స్వల్పంగా విరిగిందని తెలిపారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు.
షూటింగ్లో నటుడు ప్రకాశ్‌రాజ్‌కు గాయం - prakasha raj Maa elections
నటుడు ప్రకాశ్‌రాజ్ షూటింగ్లో గాయపడినట్లు తెలిపారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పారు. సర్జరీ చేయించుకోవడానికి హైదరాబాద్ వస్తున్నట్లు వెల్లడించారు.
ప్రకాశ్‌రాజ్
శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ వచ్చి, తన మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి దగ్గర సర్జరీ చేయించుకోబోతున్నట్లు వెల్లడించారు. ప్రకాశ్‌రాజ్ 'మా' ఎన్నికల్లో అధ్యక్షపదవికి పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ సెప్టెంబరులో జరగనున్నాయి.
ఇదీచూడండి: MAA Elections: ప్రకాశ్ రాజ్ ట్వీట్‌కు నరేశ్ సెటైర్!
Last Updated : Aug 10, 2021, 6:05 PM IST